చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామ పంచాయతీ నందు సోమవారం చెత్త నుండి సంపద తయారీ కేంద్రంను సర్పంచ్ పున: ప్రారంభించారు. ఉన్నత అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న సంపద కేంద్రాల పునరుద్ధరణ పనులను పూర్తి చేసి త్వరితగతిన వాటిని వినియోగంలోకి తీసుకుని రావాలని ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓడూరు సతీష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి దారా రమణయ్య, సిబ్బంది జి. మానస వీణ మరియు తదితరులు పాల్గొన్నారు.