నూతనంగా పదవి భధ్యతలు స్వీకరించిన జీడీ నెల్లూరు ఎమ్మార్వో చంద్రశేఖర్ ని ఆర్టీఐఏఎస్ సభ్యులు రెవిన్యూ కార్యాలయములో గురువారం కలిసారు. ఆర్టీఐఏఎస్ సంస్థ సభ్యులను ఆర్టీఐఏఎస్ సంస్థ గురించి ఎమ్మార్వో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత ఆర్టీఐఏఎస్ సభ్యులు ఎమ్మార్వో చంద్రశేఖర్ ని ఘనంగా శాలువ తో సత్కారించారు. ఎమ్మార్వో చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆర్టిఐ లో వచ్చిన అప్లికేషన్ ను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు బండి పట్టాభి రెడ్డి, డాక్టర్ తిలక్, డీకే కుమార్, రామరాజు, త్యాగరాజులు రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, లోకనాధం నాయుడు, జయపాల్, పట్టాభి, సభ్యులు పాల్గొన్నారు.