చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో బుధవారం ఉదయం 12 గంటల వరకు పడిన వర్షపాతం వివరాలను అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలసముద్రం మండలంలో 26 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వెదురుకుప్పం 14, కార్వేటి నగరం 12, పెనుమూరు 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వర్షం వచ్చే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని తెలిపారు.