యాదవులను కించపరిస్తే పుట్టగతులు ఉండవు: జోగారావు

1160பார்த்தது
యాదవులను కించపరిస్తే పుట్టగతులు ఉండవు: జోగారావు
విశాఖపట్నంలో శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కూన రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర మంత్రులు గొర్రెల కాపరులు కంటే హీనం అంటూ యాదవుల మనోభావాలు దెబ్బ తీశారని టెక్కలి నియోజక వర్గం యాదవ సంఘము అద్యక్షులు చిన్ని జోగారావు మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టే నీచ రాజకీయం మానుకొని యాదవులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సర్పంచ్ లు సోమేశ్వరరావు, గున్నయ్య, అప్పారావుతో పాటు పలువురు యాదవ్ సంఘం నాయకులు, యువకులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி