కొత్తూరు మండలంలోని అంగూరు ఇసుక రీచ్ లో సోమవారం ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్, ప్రొక్లెయినర్ ను అర్ఐ లక్ష్మణ్ కూమార్, విఆర్ఓ జె. దూరవాసులు కలిసి ఆకుల తంపర వద్ద పట్టుకున్నారు. అనంతరం వీటిని కొత్తూరు పోలీసులకు అప్పగించినట్టు ఆర్ఐ తెలిపారు. ఇప్పటికే ఇసుక అక్రమ రవాణా పై గట్టి నిఘా ఉంచామని రెవిన్యూ సిబ్బంది తెలిపారు.