పలాసలో టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు ఇంటిపై శనివారం వేకువజామున 3 గంటల సమయంలో ఆయన ప్రత్యర్థులు రాళ్ల దాడికి దిగారు. ఇంటిముందు బ్యూటిఫికేషన్ కోసం ఏర్పాటు చేసిన చలువ అద్దాలను పగులగొట్టారు. రెండు ద్విచక్రవాహనాలను సైతం కింద పడేసి బీభత్సం సృష్టించారు. దీంతో తనకు రక్షణ కల్పించాలని కాశీబుగ్గ పోలీసులకు శనివారం ఉదయం ఫిర్యాదు చేశారు. దుర్గాపూజ సందర్భంగా శుక్రవారం రాత్రి తలెత్తిన గొడవే.. ఈ దాడికి కారణమని ఆరోపించారు.