పలాస మున్సిపాలిటీలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల గతంలో ఒక ప్రైవేట్ భవనంలో కొనసాగేది. నేడు పక్క భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శనివారం నూతన భవనంలోకి మార్పించేందుకు ఆమె ప్రారంభోత్సవం చేపట్టారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించే దిశగా ఈ భవనాన్ని రూపొందించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. కార్య క్రమంలో స్థానికులు పాల్గొన్నారు.