సోంపేట ఎక్సైజ్ స్టేషన్లో సీఐ కె బేబీ శనివారం కల్లుగీత కార్మికులతో సమావేశం నిర్వహించారు. కల్లుగీత కార్మికులకు పలు సూచనలు అందజేశారు. స్వచ్ఛమైన కల్లు విక్రయించాలని, కల్లులో ఎటువంటి కల్తీ జరపరాదని, కల్తీ జరిగినట్లు తెలిసినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సోంపేట ఎక్సైజ్ సీఐ కె బేబీ ఆదేశించారు. ఇప్పటికే దీనిపై తమ సిబ్బందితో ప్రత్యేకంగా ఉంచామని స్పష్టం చేశారు.