రణస్థలం మండల కేంద్రం జాతీయ రహదారి పై గత కొన్నాళ్లుగా చీకటిమయంగా ఉండి అనేక ప్రమాదాలకు కారణం అవుతుండటంతో స్థానికులు ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే జాతీయ రహదారుల అధికారులను క్యాంప్ కార్యాలయానికి పిలిపించి, వారితో చర్చించి పరిష్కార మార్గం సూచించారు. ఫలితంగా బుధవారం విద్యుత్ దీపాలను అమర్చారు. స్థానికులు, ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.