సరుబుజ్జిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం ఇంటర్మీడియట్ జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి శివ్వాల తవిటి నాయుడు సందర్శించారని ప్రిన్సిపాల్ ఎం నాగేంద్ర తెలిపారు. కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలకు దీటుగా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపుదలకు ప్రభుత్వ కళాశాలలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి కళాశాలలో అందిస్తున్న విద్యా బోధనపై సంతృప్తి వ్యక్తం చేశారు.