ఆముదాలవలస మండలం వంజంగి గ్రామానికి చెందిన మెట్ట సునీల్ కుమార్ శ్రీకాకుళం జిల్లా కళింగ సంక్షేమ సేవా సంఘం యూత్ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సేవా సంఘ అధ్యక్షులు సీపాన వెంకటరమణ, రాష్ట్ర సెక్రెటరీ బెండి నారాయణరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో కళింగ సామాజిక వర్గం తరఫున వివిధ సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు.