ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి పదవ వార్డు హడ్కో కాలనీలో త్రాగునీటి బోరు మరమ్మతులకు గురైందని మాజీ కౌన్సిలర్ గొల్లపల్లి సింహాద్రి ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. బోరింగ్ దిగువ భాగం పూర్తిగా పింపురు పట్టిందని అన్నారు. సంబంధిత సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి, తక్షణమే మరమ్మతులు చేయాలని స్థానిక కాలనీవాసులు కోరుతున్నారు.