ఒడిశా బోర్డర్ లో నిఘా పెంచాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. గురువారం పాతపట్నం సమీపంలో ఉన్న ఒడిశా బోర్డర్ ను ఆయన స్థానిక సీఐతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా నుంచి మద్యం అక్రమంగా గంజాయి రాకుండా చూడాలని నాటు సారాపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం స్థానిక కార్యాలయంలో సిబ్బంది పనితీరు, హాజరు తదితర విషయాలను పరిశీలించారు.