సోంపేట మండలం పాలవలస గ్రామంలో కొలువైన శ్రీశ్రీశ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం రెండవ సోమవారం పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా మొదలైంది. ఉదయం నుండి భక్తులు విశిష్ట పూజలు నిర్వహించి, గ్రామ కళాకారులతో భజన కాలక్షేపం చేశారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తుల ఊరేగింపు అనంతరం ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపారాధన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.