ఆముదాలవలస మండలం కనుగులవలస గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం శనివారం నిర్వహించినట్లు సర్పంచ్ నూక రాజు తెలిపారు. సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో సి. సి రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణ పనులు ప్రభుత్వం ద్వారా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పల్లె గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా గ్రామస్తులకు వివరించామని అన్నారు. గత ఐదేళ్లు మౌలిక సదుపాయాలు మెరుగు పడలేదని పేర్కొన్నారు.