మడకశిర మండలం హెచ్ ఆర్ పాలెం గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబం గత ఏడు సంవత్సరాలుగా బాత్రూంలో ఒక చిన్న గదిలో నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న మడకశిర ఎమ్మెల్యే మంగళవారం వెంటనే అక్కడికి వెళ్లి 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కొత్త ఇల్లు మంజూరు చేపించారు. అప్పటిదాకా అద్దె ఇంట్లో ఉండమని అద్దె కూడా తానే చెల్లిస్తానని భరోసా ఇచ్చారు.