మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా నూతనంగా మంజూరైన ట్రాక్టర్లను గురువారం మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రారంభించారు. జూనియర్ కళాశాల నందు పంచాయతీలకు చెత్త సేకరణకు నూతనంగా మంజూరైన దాదాపు30 ట్రాక్టర్లను ప్రారంభించి మడకశిర పట్టణంలో భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమం లో గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, కన్వీనర్లు, క్లస్టర్ఇన్చార్జిలు, సర్పంచులు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.