టీడీపీ సభ్యత్వ నమోదు పై విస్తృతంగా అవగాహన కల్పించాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం కదిరి పట్టణంలోని మదనపల్లి రోడ్డులో గల పివిఆర్ ఫంక్షన్ హాల్ లో టీడీపీ సభ్యత్వ నమోదు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు అంటే అది కేవలం గుర్తింపు మాత్రమే కాదని. అది ఒక కుటుంబానికే భరోసా లాంటిదని అన్నారు.