కదిరి మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి సమీపాన రాయచోటి ప్రధాన రహదారిలో అప్ గ్రేడ్ సీఐ మోహన్ వాహనాలు మంగళవారం తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని వాహనదారులకు సూచించారు. వాహనాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా ఉండాలన్నారు. ప్రయాణంలో రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలని వాహనదారులకు సూచించారు. సిబ్బంది గంగాధర్, చంద్రమోహన్ పాల్గొన్నారు