పామిడి పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయావరణలో మంగళవారం విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాన్ని ప్రారంభించినట్లు విద్యుత్ జూనియర్ అకౌంట్ ఆఫీసర్ రీసెంట్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ బిల్లులు చెల్లింపు కేంద్రాన్ని ప్రారంభించమన్నారు. పట్టణ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.