గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని జడ్ వీరారెడ్డి కాలనీలో గురువారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పర్యటించారు. ఈ మేరకు డ్రైనేజీ, వీధిలైట్లు, రోడ్లు వంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు నిర్మల, శ్యామల కాంతమ్మ ఆధ్వర్యంలో ఆయనకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కమిషనర్ జడ్ వీరారెడ్డి కాలనీలో గల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.