గుత్తి మున్సిపాలిటీ పరిధిలో గల అన్న క్యాంటీన్ ను శనివారం కమీషనర్ జబ్బర్ మియా తనిఖీ చేశారు. ముందుగా క్యాంటీన్ పరిసరాలను పరిశీలించారు. క్యాంటీన్లో గల ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ప్రజలకు తన చేతుల మీదుగా అన్నం వడ్డించారు. తరువాత ప్రజలను అన్న క్యాంటీన్ గురించి ఆరా తీశారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.