అనంతపురం నగరంలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేష్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జె. రాజా రెడ్డి, నాయకులు నిర్మాణం, భవిష్యత్ కార్యక్రమాలపై కృషి చేయాలని చెప్పారు. అక్టోబర్ 31న ఏఐటీయూసీ 105వ ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు.