విద్యా హక్కు చట్టం 2009, అలాగే పాఠశాల విద్యాశాఖ ట్రస్టు సొసైటీ చట్టాలకు వ్యతిరేకంగా పాఠశాలలను నడుపుతున్నారని ప్రజాబలం చందు నాయక్ అన్నారు. గురువారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీ జరుగుతుందని, కనీసం మౌళిక వసతుల కల్పించకుండా అర్హులైన బోధన బోధనేతర సిబ్బంది లేకుండానే పాఠశాలలు నిర్వహిస్తున్నారన్నారు. అటువంటి పాఠశాలలను గుర్తించి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.