ఉదయగిరి: అల్పపీడనం కారణంగా మోస్తారు వర్షం
ఉదయగిరి మండలం లోని కొన్ని ప్రాంతాలు, గ్రామాల్లో బుధవారం ఉదయం మోస్తరు వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాకు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో జిల్లాలోని కావలి, ఆత్మకూరు, కందుకూరు నియోజకవర్గాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తమయ్యారు.