నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వింజమూరు మండల సోషల్ మీడియా కన్వీనర్ పెసల శివారెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం కిడ్నాప్ చేశారు. కారులో వచ్చి పోలీసులమని చెప్పి అతనిని తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా తమకేం తెలియదని తాము తీసుకెళ్లలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. శివారెడ్డిని తీసుకెళ్తున్న దృశ్యాలు సిసి టీవీలో రికార్డు అయ్యాయి.