వర్షం పడితే చాలు కలిగిరిలో అధ్వానమైన పరిస్థితి నెలకొంటుంది. మంగళవారం కురిసిన వర్షానికి రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలు పూడికలతో నిండిపోవడంతో వర్షపు నీటితో పాటు మురుగునీరు కూడా పొంగిపొర్లుతుంది. ఓవైపు నడవలేని పరిస్థితి మరోవైపు దుర్వాసనతో కలిగిరి పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.