ఉదయగిరి పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో బాణసంచా కొనడానికి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని ఆనకట్ట సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేయాలని పోలీసులు ముందే నిర్వాహకులకు తెలపడంతో అక్కడ దుకాణాలు ఏర్పాటు చేశారు. 4 షాపులు ఒకే దిక్క ఏర్పాటు చేయడంతో జనాల తాకిడి ఎక్కువైంది.