వెలుగొండ ప్రాజెక్ట్ మెట్ట ప్రాంతమైన ఉదయగిరి ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కల అని, ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో వెలుగొండ ప్రాజెక్టుకు అన్యాయం జరిగిందని రైతు సంఘం నాయకులు, ఉదయగిరి సిపిఎం పార్టీ అధ్యక్షుడు కాకు వెంకటయ్య తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు అభివృద్ధికి న్యాయపరంగా బడ్జెట్ కేటాయించలేదని మంగళవారం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.