ఉదయగిరి పట్టణంలోని ఆనకట్ట ఆధునికరణకు రూ. 9 కోట్లు మంజూరు అయినట్లు ఆత్మకూరు ఇరిగేషన్ శాఖ ఈ ఈ ఆర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఆనకట్ట ఆధునికరణ పనులను ఆయన పరిశీలించారు. గుత్తే దారుడు ఆధునికరణ పనులపై సూచనలు చేశారు. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయాలని కోరారు. ఆయన వెంట ఉదయగిరి ఇరిగేషన్ ఈ ఈ చంద్రమౌళి, అధికారులు ఉన్నారు.