నెల్లూరు జిల్లా ఉదయగిరి తహశీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం ఆత్మకూరు ఆర్డీవో భూమి రెడ్డి పావని తనిఖీ చేశారు. ఆమె తహశీల్దార్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. సిబ్బంది అందుబాటులో ఉండి, రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. తహశీల్దార్ సుభద్ర, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.