దుత్తలూరు: వర్షానికి అలుగు పారుతున్న బ్రహ్మేశ్వరం చెరువు
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం పాత చెరువు అలుగు పారుతుంది. శనివారం ఉదయాన కురిసిన భారీ వర్షంతో పాటు చుట్టుపక్కల కాలువల నుంచి వస్తున్న నీరుకి చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతుంది. దీని ద్వారా ఆ చెరువు కింద ఉన్న ఆయకట్ట రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు చెరువు సగం వరకు నిండింది. ఈరోజు మళ్లీ వర్షం కురవడంతో పూర్తిగా నిండి అలుగు పారుతుంది.