ఉదయగిరి తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో చినుకు పడితే చిత్తడే చిత్తడి. ఈ ప్రాంగణంలోనే సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా ఉండడంతో ప్రతిరోజు ఎక్కువ సంఖ్యలో ప్రజలు వివిధ రకాల పనుల నిమిత్తం కార్యాలయాలకు వస్తుంటారు. వర్షాలు పడినప్పుడు ఇక్కడ నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి పరిస్థితి ఏంటని గుసగుసలాడుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.