నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల కేంద్రంలో బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నూతన స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ ఇవ్వనున్న నేపథ్యంలో అంతరాయం ఏర్పడుతుందని ఈ ఖుద్దూస్ భాష తెలిపారు. విద్యుత్ వినియోగదారులందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఒంటిగంట తర్వాత యధావిధిగా విద్యుత్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు.