దుత్తలూరు మండలం ఏరుకొల్లులో శనివారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేవాలయం దగ్గరున్న బ్రిడ్జి సామర్థ్యం తక్కువ కావడంతో వరద నీటిలో కొట్టుకొచ్చిన మొద్దులు, బురద ఇరుక్కుపోయాయి. దీంతో వరద పెరిగితే ప్రమాదమని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గోవింద్ యాదవ్ చొరవ తీసుకుని వాటిని తొలగించి గ్రామస్తులతో శభాష్ అనిపించుకున్నారు.