మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని మనుబోలు ఎస్సై శివ రాకేష్ తెలిపారు. రానున్న నాలుగు రోజులు చాలా కీలకం .జిల్లాకు భారీ వర్షం సూచన ఉన్న నేపథ్యంలో మండల పరిధిలోని అన్ని కల్వర్టులు, కాలువలు, ముప్పు ప్రాంతాలను సందర్శించాలి. ఎప్పటికప్పుడు నివేదిక ఉన్నత అధికారులు అందించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో సోమవారం సిబ్బందితో సమావేశం నిర్వహించారు.