ముత్తుకూరు పరిధిలోని కృష్ణపట్నంలో ఆదాని జూనియర్ కళాశాల భూమి పూజను సీఈఓ జగదీష్ పటేల్ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ కళాశాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రావు, రాజేష్ రంజన్, వేణుగోపాల్, గణేష్ శర్మ పాల్గొన్నారు.