ఉపాధ్యాయులకు నెలవారీ పదోన్నతులివ్వాలి - పిటిఎఫ్

59பார்த்தது
ఉపాధ్యాయులకు నెలవారీ పదోన్నతులివ్వాలి - పిటిఎఫ్
వెంకటాచలం మండలం సర్వేపల్లి నిడిగుంట పాలెం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని సర్వేపల్లి, నిడిగుంటపాలెం, ఇస్కపాలెం గ్రామాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులచే ఫూలే టీచర్స్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి జి. వి. రత్నం, రాష్ట్ర అధ్యక్షుడు అన్నం శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి తుమ్మా రవి, జిల్లా నాయకులు అద్వానపు రవి బాబు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉన్నది కావున విద్యార్ధుల బోధనకు ఆటంకము కలుగకుండా ఉపాధ్యాయులకు ప్రతీ నెలా పదోన్నతులు కల్పించాలన్నారు. పదోన్నతులకు, నియామకాలకు ఒకే విద్యార్హతలు ఉండాలని , ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టాలని, హై స్కూల్స్ నందు అన్ని తరగతుల్లో తెలుగు ఇంగ్లీషు మాధ్యమాలను సమాంతరంగా నిర్వహించాలని తెలిపారు. ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని, తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అమలయ్యేలా చూడాలని తద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி