శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ సుజాత సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆమె గతంలో వైద్య ఆరోగ్యశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా అనంత పురం జిల్లా ముదిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేశారు. అనంతరం డిప్యూటీ సివిల్ సర్జన్ పదోన్నతి పొందారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు రూరల్ హెల్త్ సెంటర్ లో డిప్యూటీ సివిల్ సర్జన్ గా పనిచేస్తూ పదోన్నతిపై నెల్లూరుకు వచ్చారు.