గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన రాష్ట్ర అర్దిక పరిస్థితి ఆధ్వానంగా వుందని, రాష్ట్ర అర్దిక ఇబ్బందుల నుంచి బయట పడే విధంగా చూడాలని ఏసు ప్రభువుని కోరుకోవడం జరిగిందని రాష్ట్ర పురపాలక మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు. బుధవారం క్రిస్మమస్ సందర్బంగా నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ పరిధిలోని యనమలవారి దిన్నె ప్రాంతంలో క్రిస్మమస్ పండుగ సందర్బంగా చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు.