కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తొలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అట్టహాసంగా జరిగింది. టిటిడి ఛైర్మన్ బి. ఆర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన పాలకమండలి సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చేపట్టనున్న వివిధ సంస్కరణలపై చర్చించారు. భక్తుల సౌకర్యాలపై మాట్లాడారు.