నెల్లూరు: అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కోటంరెడ్డి

77பார்த்தது
నెల్లూరు: అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని 22 డివిజన్ బీవీ నగర్ లో బుధవారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 1 కోటి 20 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ ఈ నిధులను ప్రాంతీయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం వినియోగిస్తామని పేర్కొన్నారు. ఆయనతో పాటు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ కూడా పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி