కోవూరు: వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఢీకొని మహిళ మృతి
కోవూరు మండలం పడుగుపాడు రైల్వే గేట్ వద్ద బుధవారం జరిగిన రైలు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. స్థానిక లేగుంటపాడు గ్రామానికి చెందిన సరోజమ్మ (65) రైల్వే గేటు దాటుతుండగా తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు వెళ్తున్న వందే భారత్ రైలు ఢీకొట్టింది. స్థానిక రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతురాలి బంధువులతో సంఘటన స్థలం హృదయ విదారంగా మారింది.