ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా విజ్ఞప్తుల దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి పిలుపునిచ్చారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఆమె ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా వినతులను నగర పంచాయతిలోని వివిధ విభాగల అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.