కావలిలోని అక్కంబావిలో వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. దీనిపై కావలి 1వ టౌన్ సిఐ ఫిరోజ్ వివరణ ఇచ్చారు. వెంకయ్య గారి పాలెం కు చెందిన కూర శ్రీకాంత్ (30) ఒకటిన్నర సంవత్సరం క్రితం అదే గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహమైంది. మనస్పర్ధల కారణంగా వారిద్దరు దూరంగా ఉంటున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో పూర్తి విషయాలను తెలుసుకుంటామన్నారు.