నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని కొత్త రెడ్డిపాలెంలో ఆదివారం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.