పామూరు నుంచి కందుకూరు మీదుగా ఒంగోలు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు ఆదివారం ప్రమాదానికి గురైంది. 20 మంది ప్రయాణికులతో ఒంగోలు బయలుదేరిన ఆర్టీసీ బస్సు మార్గమధ్యలో కందుకూరు పరిధిలోకి రాగానే బస్సు ముందువైపు టైర్ ఊడిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపేశాడు. డ్రైవర్ చాకచక్యంతో బస్సు నిలపడంతో ప్రయాణికులకు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాలం చెల్లిన బస్సు కావడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు విమర్శించారు.