కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కరేడు-1 సచివాలయంను డిస్టిక్ టాస్క్ ఫోర్స్ టీం డిపిఓ రమేష్ షైని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని రికార్డులు పరిశీలించారు. అలాగే స్థానిక పీహెచ్సీని సందర్శించి గర్భిణీల నమోదు, హైరిస్క్ గర్భిణీలకు ప్రభుత్వం తరఫున అందిస్తున్న సేవలు గురించి వివరించారు. అలాగే సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.