వలేటివారిపాలెం మండలం మాలకొండ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ని శనివారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు, వేదపండితులు ఎమ్మెల్యే కి స్వాగతం పలికారు. అనంతరం అన్నదాన సత్రంలో భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఏటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని దేవస్థానం అధికారులకు తెలియజేశారు.