యర్రగొండపాలెం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 13 మద్యం షాపులు కేటాయించడం జరిగిందని మార్కాపురం ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్ బాలయ్య సోమవారం తెలిపారు. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేవాళ్లు ఈనెల 9వ తేదీలోపు ఆన్లైన్ లో కానీ మీ స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో కానీ దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు దారుడు రూ. 2 లక్షలు డి. డి తీయవలసి ఉంటుందని బాలయ్య చెప్పారు. ప్రభుత్వం నాణ్యమైన మద్యం సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.